: పేరీ పెహ్ నా పాజీ... సచిన్ కు యువీ బర్త్ డే గ్రీటింగ్స్!


క్రికెట్ లో భారత కీర్తి ప్రతిష్ఠలను విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్ ను దేశం భారతరత్నతో సత్కరించింది. ఇక ఆటలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన అతడు, అందరికీ ‘అన్న’లానే మారాడు. కేన్సర్ ను జయించి ఆటలో సత్తా చాటిన యువరాజ్ సింగ్ కైతే అంతకన్నా ఎక్కువే. అందుకేనేమో మొన్న సచిన్ కు 42వ జన్మదినం సందర్భంగా యువీ వినూత్న రీతిలో బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పాడు. పేరీ పెహ్ నా పాజీ (అన్నా నీ కాళ్లకు దండం) అంటూ పంజాబీలో సరికొత్త రీతిలో శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు, ఈ సందర్భంగా అతడు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫొటో, సచిన్ పై అతడికున్న అభిమానాన్ని తేటతెల్లం చేసింది. గత గురువారం ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ మైదానంలో ఉన్న సచిన్ ను వెనుకగా వచ్చిన రెండు చేతులు అతడి కాళ్లను పట్టేశాయి. దీంతో షాక్ కు గురైన సచిన్, వెనుదిరిగి చూడగా, ఆ రెండు చేతులు యువీవని తేలింది. దీంతో ఆప్యాయంగా యువీని పైకి లేపిన సచిన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. సచిన్ కాళ్లను పట్టుకున్న యువీ, అదే ఫొటోను ట్విట్టర్ లో పెట్టాడు. దానికి జన్మదిన శుభాకాంక్షలను జోడించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

  • Loading...

More Telugu News