: నేను తల్చుకుంటే చంద్రబాబు ఇల్లు కదలగలడా?: తలసాని


తాను తల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇల్లు కదలగలడా? అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదని, హైదరాబాదు కూడా తెలంగాణలోనే ఉందని టీడీపీ నేతలు గుర్తించాలని అన్నారు. నేతలే టీఆర్ఎస్ లో ఉన్నారు, క్యాడర్ లేరని చెబుతున్న టీడీపీ నేతలు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదుకు వచ్చిన ఆదరణ చూడాలని ఆయన సూచించారు. టీడీపీలో క్యాడర్ మెంబర్ షిప్ తీసుకున్నారని చెబుతున్న లెక్కలన్నీ గిమ్మిక్కులేనని, క్యాడర్ పేరిట పార్టీ నేతలే డబ్బులు చెల్లిస్తారని, అదంతా చంద్రబాబు తరహా రాజకీయమని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదులో కేవలం హైదరాబాదు నుంచే 2 కోట్ల రూపాయలు సమకూరాయంటే దాని అర్థం ఏంటో టీడీపీ నేతలు సరిచూసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News