: నేపాల్ లో మరోసారి భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదు


నిన్నటి భారీ భూకంపానికి చిగురుటాకులా వణికిపోయిన నేపాల్ లో కొద్దిసేపటి క్రితం మరో భారీ భూకంపం చోటుచేసుకుంది. వరుస క్రమంలో చోటుచేసుకున్న ఈ భూకంపం ఆ దేశ జనాలను భీతావహులను చేసింది. కొద్దిసేపటి క్రితం సంభవించిన ఈ తాజా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. తాజా భూకంపం కారణంగా నేపాల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. నిన్న 11.56 గంటలకు భూకంపం సంభవించగా, నేడు 12.43 గంటలకు తాజా భూకంపం చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం నుంచి రోడ్లపైనే ఉండిపోయిన నేపాలీలు, తాజా భూకంపంతో పరుగులు పెట్టారు.

  • Loading...

More Telugu News