: ఉత్తర భారతంలో మళ్లీ కంపించిన భూమి... ఇళ్లు వదిలి పరుగులు పెట్టిన ఢిల్లీ వాసులు
నిన్నటి భూకంపాల నుంచి ఇంకా తేరుకోనే లేదు, అప్పుడే మళ్లీ ఉత్తర భారత దేశంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్టేలుపై ఈ భూకంపాల తీవ్రత 6.9 గా నమోదైంది. ఇదిలా ఉంటే, ఈ భూకంపం ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ, లక్నో, అలహాబాదు, కోల్ కతాల్లోనూ కనిపించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. నిన్నటి నేపాల్, బీహార్ లలో జరిగిన విధ్వంసం నేపథ్యంలో తాజా ప్రకంపనలు దేశ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.