: ఏపీకి ప్రత్యేక హోదా కోసం టవరెక్కిన గుంటూరు యువకుడు... నిన్నటి నుంచి టవర్ పైనే ఆందోళన


ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓ వైపు రాజకీయంగా వాడీవేడీ చర్చ సాగుతుండగానే, మరోపక్క గుంటూరుకు చెందిన సంజీవరావు అనే యువకుడు ఉద్యమ బాట పట్టాడు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కూడా లేని ఏపీ, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే కొంతలో కొంతైనా మేలు జరుగుందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంజీవరావు నిన్న గుంటూరులోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ను ఎక్కాడు. రాత్రంతా సెల్ టవర్ పైనే ఉన్న సంజీవరావు, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే కాని కిందకు దిగనని మొండికేస్తున్నాడు. అతనిని కిందకు దించేందుకు పోలీసులు చేస్తున్న యత్నాలు ఫలించడం లేదు.

  • Loading...

More Telugu News