: ఆసక్తికరంగా సన్ రైజర్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్... 6 ఓవర్లలో 59 పరుగులు చేయాలి!
ముంబయిలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్ష్య ఛేదనలో ముందుకు సాగుతోంది. ముంబయి ఇండియన్స్ విసిరిన 158 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన హైదరాబాద్ 14 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 36 బంతుల్లో 59 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా 7 వికెట్లుండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (24 బ్యాటింగ్), రవి బొపారా (13 బ్యాటింగ్) ఉన్నారు. కాగా, ఓపెనర్ శిఖర్ ధావన్ 29 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టుకు జెట్ స్టార్ట్ అందించాడు. అయితే, మరో ఓపెనర్ వార్నర్ (9) నిరాశపరిచాడు.