: ఖాట్మండూలో కుప్పకూలిన యోగా వేదిక... ప్రమాదం నుంచి తప్పించుకున్న బాబా రాందేవ్
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నేపాల్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. యోగా శిక్షణతో పాటు భాగమతి నదీ ప్రక్షాళన కార్యక్రమం కోసం ఆయన నేపాల్ వెళ్లారు. అయితే, భూకంపం కారణంగా ఆయన యోగా శిక్షణకు ఉద్దేశించిన వేదిక కుప్పకూలిపోయింది. ఖాట్మండూలో పాతిక వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు వేదిక ఏర్పాటు చేశారు. భూకంప తీవ్రతకు ఈ వేదిక కూలిపోగా, దానిపై ఉన్నవారు పడిపోయారట. అయితే, బాబా రాందేవ్ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నేపాల్ ను వణికించిన ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించాయి. అనేక చారిత్రక కట్టడాలు నేలమట్టం అయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలోనే పలుమార్లు భూమి కంపించడంతో నేపాలీయులు హడలిపోయారు. ఉత్తర భారత రాష్ట్రాల్లోనూ భూకంపం కారణంగా మరణాలు సంభవించడం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలపై మాత్రం దీని ప్రభావం పెద్దగా కనిపించలేదు.