: నేపాల్ లో 13 సార్లు భూ ప్రకంపనలు... ఇప్పటివరకు 500 మంది మృతి
భూకంపంతో నేపాల్ వణికిపోయింది. ఉదయం 11.56 గంటల సమయంలో 30 సెకన్ల నుంచి 2 నిమిషాల పాటు మొదటిసారి భూమి కంపించింది. తరువాత కూడా మూడు గంటల వ్యవధిలో 13 సార్లు భూమి కంపించింది. నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైతే, చైనా రికార్డుల ప్రకారం 8.1గా నమోదైంది. ఖాట్మండుకు 80 కిలో మీటర్ల దూరంలోని లాంగ్ జామ్ ను భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు. ఖాట్మండులో అనేక పెద్ద భవనాలు, చారిత్రక కట్టడాలు కుప్పకూలాయి. భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు దాదాపు 500 వరకు మరణించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఖాట్మండులోనే భారీ ప్రాణ నష్టం జరిగింది.