: టాస్ ఓడిన సన్ రైజర్స్... ముంబయి బ్యాటింగ్
ముంబయి ఇండియన్స్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడిపోయింది. టాస్ నెగ్గిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదిక. ఈ మ్యాచ్ లో నెగ్గి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం దక్కించుకోవాలని సన్ రైజర్స్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అటు, సొంతగడ్డపై మ్యాచ్ కావడంతో ముంబయిపై అంచనాలు నెలకొన్నాయి. పొలార్డ్, రోహిత్ శర్మ, సిమ్మన్స్, రాయుడు, మలింగ... ధావన్, వార్నర్, స్టెయిన్, బౌల్ట్ వంటి స్టార్లు బరిలో ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని క్రికెట్ పండితులంటున్నారు.