: షూటింగ్ కోసం నేపాల్ వెళ్లిన 'ఎటకారం' యూనిట్... దొరకని ఆచూకీ


నేపాల్ లో భారీ భూకంపం సంభవించడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం చోటుచేసుకుంది. కాగా, నేపాల్ లో హైదరాబాద్ కు చెందిన వారు కూడా చిక్కుకున్నట్టు తెలిసింది. వారిలో 'ఎటకారం' సినిమా యూనిట్ సభ్యులు కూడా ఉన్నారు. మీడియాలో భూకంపం వార్తలు రావడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో, నేపాల్ లో కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొబైల్ నెట్వర్క్ లు పనిచేయడం లేదు. దీంతో, తమ వారి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 'ఎటకారం' సినిమాకు ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్న కుమారుడు వీరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

  • Loading...

More Telugu News