: అత్యవసర పరిస్థితి ప్రకటించిన నేపాల్ ప్రభుత్వం
నేపాల్ లో భూకంప తీవ్రత అధిక స్థాయిలో ఉండటంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పురాతన కట్టడాలు, భవనాలు, చారిత్రక కట్టడాలు నేలకొరిగాయి. ఖాట్మండులో భారీ ప్రాణ నష్టం జరిగింది. క్షతగాత్రులతో ఇక్కడి ఆసుపత్రులు నిండిపోయాయి. శిథిలాల కింద భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఖాట్మండులో 62 మీటర్ల చారిత్రక ధరహర టవర్ కూలింది. దాని కింద పలువురు పౌరులు చిక్కుకున్నట్టు సమాచారం. మరోవైపు సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి.