: భూకంపం పెద్దదే... కూలిన భవనాలు
అరగంట క్రితం నేపాల్, ఇండియా దేశాలను కుదిపిన భూకంపం వల్ల ఏర్పడిన నష్టంపై తొలి వార్తలు వెలువడుతున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండుకు 83 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు యూరోపియన్ సెస్మోలాజికల్ సెంటర్ వివరించింది. నేపాల్ లో పలు భవంతులు కుప్పకూలినట్టు తెలుస్తోంది. అయితే, ప్రాణనష్టం ఎంత మేరకు జరిగిందన్న విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది. ఉత్తర భారతావనిలో చాలా చోట్ల 30 సెకన్ల నుంచి 4 నిమిషాల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. పలు చోట్ల ఇండ్లలో అటకలపై ఉంచిన సామాన్లు కిందపడగా, ప్రజలు వీధుల్లోకి పరుగులు పెట్టారు. ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీలో అన్ని మెట్రో రైళ్లను ఎక్కడివక్కడే రద్దు చేశారు.