: 'కల్ హో నా హో' పాటకు జర్మనీ అంబాసిడర్ సతీ సమేతంగా డ్యాన్స్


2003లో వచ్చిన రొమాంటిక్ డ్రామా 'కల్ హో నా హో' చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. షారూఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, ప్రీతీ జింతాలు ఈ చిత్రంలో నటించారు. భారత్ లో జర్మనీ అంబాసిడర్ మైఖేల్ స్టీనర్ కు ఈ సినిమా అంటే ఎంతో ఇష్టం. సినిమాలోని ఒక పాటను, తన భార్యతో కలసి ఆయన రీమేక్ చేశారు. దీన్ని జర్మనీ ఎంబసీ విడుదల చేసింది. ఈ పాటలో సైఫ్ అలీ ఖాన్ పాత్రను కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పోషించారు. ఆయనతో పాటు మైఖేల్, ఆయన భార్య ఎల్లీస్ లు ఈ పాటలో నటించారనడం కన్నా జీవించారనే చెప్పొచ్చు. ఈ ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఈ పాటే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News