: 80 కోట్ల మందికి ఉచిత నెట్ సేవలు: జుకెర్ బర్గ్


ప్రపంచంలోని 9 దేశాల్లో ఇంటర్నెట్.ఆర్గ్ ద్వారా 80 కోట్ల మందికిపైగా ప్రజలకు ప్రాథమిక ఇంటర్నెట్ సర్వీసులు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ వెల్లడించారు. తొలి క్వార్టర్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో నెట్ ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మరింత కృషి చేస్తున్నామని అన్నారు. 500 కోట్ల మందికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో శాంసంగ్, క్వాల్ కామ్ వంటి దిగ్గజాలతో కలిసి ఇంటర్నెట్.ఆర్గ్ ను ఫేస్ బుక్ నిర్వహిస్తోంది. భారత్ లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో ఫేస్ బుక్ ఒప్పందం చేసుకుంది.

  • Loading...

More Telugu News