: అమరావతిలో వారి భూములు వారికిచ్చేయండి: హైకోర్టు


రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తొలి అడ్డంకి ఎదురైంది. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతుల పక్షాన హైకోర్టు నిలిచింది. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 600 మంది రైతుల భూములు వారికి ఇచ్చేయాలని, ల్యాండ్ పూలింగ్ నుంచి వారిని తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ప్రభుత్వమే అమలు చేయకపోవడం న్యాయసమ్మతం కాదని న్యాయమూర్తులు తెలిపారు. రైతులు తమ భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సమయానికి దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News