: 30 నిమిషాల్లో 23 వేల మందికి పైగా ఫాలోవర్లు... తగ్గని సచిన్ హవా


భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ హవా కొనసాగుతోంది. క్రికెట్ కు రిటైర్మెంటు ప్రకటించినా, ఆయన పట్ల అభిమానుల్లో ఆరాధన తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం. సచిన్ నేడు తన 42వ జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచారు. అలా అడుగుపెట్టారో లేదో... అరగంట వ్యవధిలో ఫాలోవర్ల సంఖ్య 23 వేలకు పైగా చేరింది. తొలి పోస్టుగా, కుటుంబంతో తీసుకున్న సెల్ఫీని సచిన్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు. సచిన్ ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ లో క్రియాశీలకంగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News