: ఆఫ్ఘనిస్థాన్ కు మూడు 'చీతా' హెలికాప్టర్లు ఇచ్చిన ఇండియా


మూడు అత్యాధునిక 'చీతా' హెలికాప్టర్లను ఆఫ్ఘనిస్థాన్ కు డెలివరీ ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఈ మూడు హెలికాప్టర్లనూ ఈ నెల 9న ఆఫ్ఘన్ కు పంపించామని, అక్కడి పైలెట్లు వీటిని 15న నడిపిచూసి సంతృప్తి చెందారని పెర్కొన్నారు. ఇరు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ హెలికాప్టర్ల డెలివరీ జరిగినట్టు తెలిపారు. కాగా, చీతా మోడల్ హెలికాప్టర్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News