: అత్యాచారం, హత్య కేసులో నలుగురికి మరణశిక్ష


ఎనిమిదేళ్ల కిందటి అత్యాచారం, హత్య కేసులో నలుగురు నేరస్థులకు జమ్ము కాశ్మీర్ లోని స్థానిక కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2007లో 13 ఏళ్ల తబింద గాని అనే బాలిక కుప్వారాలోని పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత బాలికను హత్య కూడా చేశారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై కేసు నమోదవగా, అనంతరం విచారణ సాగింది. తాజాగా కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. నేరస్థుల్లో సాదిక్ మీర్, అజహర్ అహ్మద్ మిర్ లు కాశ్మీర్ లోని లాంగేట్ స్థానికులు కాగా, మరో ఇద్దరు పశ్చిమబెంగాల్, రాజస్థాన్ కు చెందిన వ్యక్తులు.

  • Loading...

More Telugu News