: ఇంతకంటే అవమానం మరొకటి లేదు: ఇమ్రాన్ ఖాన్
బంగ్లాదేశ్ తో క్లీన్ స్వీప్ కు గురవ్వడం కంటే అవమానం మరొకటి లేదని పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ జట్టు చేతిలో పాక్ పరాజయం పాలైన తరువాత ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇంత అవమానకరమైన ఓటమి లేదని అన్నారు. క్రికెట్ ను బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయాలు పట్టిపీడిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దేశంలో ప్రతిభకు కొదువలేదని, అయితే పాలకుల్లోనే చిత్తశుద్ధి లేదని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా పీసీబీ దేశవాళీ క్రికెట్ ను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పీసీబీలోని వ్యక్తులను మార్చేంత వరకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు తీరుమారదని ఆయన తెలిపారు.