: నోరూరిస్తున్న తెలంగాణ ఘుమఘుమలు!


తెలంగాణ రాప్ట్ర సమితి ప్లీనరీ సమావేశాల సందర్భంగా కార్యకర్తలకు, నేతలకూ వండి వడ్డించేందుకు నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో చేసిన ఏర్పాట్లు అదిరిపోయాయి. పలు రకాల తెలంగాణ వంటకాలను పాకశాస్త్ర నిపుణులు సిద్ధం చేస్తుండగా, ఆ ఘుమఘుమలకే నోరూరిపోతోందని కార్యకర్తలు అంటున్నారు. సుమారు 36 వేల మందికి సరిపడా వంటలు వండుతున్నట్టు తెలుస్తోంది. వచ్చిన వారికి వెల్ కం డ్రింక్ గా 'అంబలి' అందిస్తున్నారు. అంబలి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరున్న పచ్చి పులుసు, చింతకాయ పప్పు, పలావు, జొన్న రొట్టెలు తదితరాలను వంటవాళ్లు సిద్ధం చేస్తున్నారు. దీంతో నిజాం కళాశాల ప్రాంగణం తెలంగాణ వంటకాల ఘుమఘుమలతో నిండిపోయింది.

  • Loading...

More Telugu News