: ఆగ్రా చర్చిపై దాడికి కారణం ప్రేమ విఫలమే... తేల్చిన పోలీసులు


ఆగ్రాలోని ప్రతాప్ పురాలోని చర్చిపై దాడి చేసి ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ విఫలమైన ఒక వ్యక్తి చేసిన పనే ఇదని తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హైదర్ అలీ అనే యువకుడు అదే చర్చిలో ఒకమ్మాయిని చూసి ప్రేమించాడు. తొలుత ఆమె సైతం అలీ ప్రేమకు ఓకే చెప్పి, ఆపై మతాల అడ్డు కారణంగా దూరం పెట్టింది. ఆమె కోసం చర్చి దగ్గరే రోజూ వేచి చూసే అలీ, అమె రావడం మానేసేసరికి, తమ మధ్య గోడగా నిలిచిందన్న కోపంతో ఆ చర్చిని, అందులోని విగ్రహాలను ధ్వంసం చేసి పారిపోయాడు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఆగ్రా సిటీ ఎస్పీ తెలిపారు.

  • Loading...

More Telugu News