: ప్రపంచంలోనే ఆనందదాయకమైన దేశంగా స్విట్జర్లాండ్


ప్రపంచం మొత్తం మీద సంతోషకరమైన ప్రజలు స్విట్జర్లాండ్ లో ఉన్నారని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. వార్షిక వరల్డ్ హ్యాపీనెస్ నివేదిక ప్రకారం ఐస్ లాండ్, డెన్మార్క్, నార్వే, కెనడా దేశాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయని 'సస్టైనబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్' (ఎస్ డీఎస్ఎన్) అనే ఓ సంస్థ తెలిపింది. మొత్తం 158 దేశాల్లోని ప్రజల సంతోషం, శ్రేయస్సు స్థాయులను బట్టి ఈ అధ్యయనం చేశారు. కాగా టోగో, బురుండి, సిరియా, బెనిన్, ర్వాండ దేశాల్లోని ప్రజలు అత్యంత అసంతృప్తితో జీవనం వెళ్లదీస్తున్నారని తెలిపింది. సమాజ శ్రేయస్సు ఎలా సాధించాలన్న దానికి ఈ నివేదిక ఉపకరిస్తుందని, కేవలం డబ్బే కాకుండా... సౌందర్యం, చిత్తశుద్ధి, నమ్మకం, మంచి ఆరోగ్యం కూడా ప్రజలు సంతోషంగా జీవించడానికి కారణాలుగా తెలిసినట్టు నివేదికలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News