: ముంబై మోడల్ పై పోలీసుల దాష్టీకం
వారు ప్రజలను కాపాడాల్సిన పోలీసులు. కానీ, ఆ రాత్రి వారిలోని మృగం నిద్రలేచింది. ఆడిషన్ నిమిత్తం ఓ హోటల్ కు వెళ్లి వస్తున్న ముంబై మోడల్ (29) వారి కంట పడింది. ఆమెను బలవంతంగా అంధేరీలోని సాకినాక పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లిన వారు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం రూ. 4.5 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని బెదిరించారు. చచ్చీ చెడీ తన స్నేహితురాలికి ఫోన్ చేసి డబ్బు తెప్పించుకుని, పోలీసులకు ఇచ్చి బతుకుజీవుడా అంటూ బయటపడింది. ఈ ఘటన ఈ నెల 4న జరుగగా, ఆ వెంటనే భయంతో ముంబై వీడివెళ్లిన మోడల్, ధైర్యం తెచ్చుకుని పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు మెసేజ్ పెట్టింది. దీంతో స్పందించిన ఆయన విచారణకు ఆదేశించగా, ఈ ఘటనకు బాధ్యులైన మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మోడల్ పై అత్యాచారానికి సహకరించిన మహిళా పోలీసు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.