: పవన్ కల్యాణ్ కు ఎస్కేయూ విద్యార్థుల ప్రశ్నాస్త్రం
అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్జీటీలుగా బీఈడీ విద్యార్థులను కూడా అనుమతించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం-చెన్నై రహదారిపై బైఠాయించారు. వారికి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా జతకలిశారు. దీంతో, భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో విద్యార్థులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రశ్నాస్త్రం సంధించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీల పట్ల పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు చంద్రబాబుకు పవన్ మద్దతిచ్చారని వారు గుర్తుచేశారు.