: ముంబై బౌలింగ్...ఢిల్లీ బ్యాటింగ్


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది. తాజా సీజన్ లో నేటి వరకు ఐదేసి మ్యాచ్ లు ఆడిన ఆ రెండు జట్లలో, ఢిల్లీ రెండు గెలిస్తే, ముంబై కేవలం ఒకే మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఐపీఎల్ లో 14 సార్లు ముఖాముఖి తలపడగా చెరి ఏడు విజయాలు సాధించాయి. ఈ సారి ఢిల్లీలో విజయం సాధించి, సొంత స్టేడియంలో పరాజయం పాలవుతుందనే అపప్రథను చెరిపేసుకోవాలని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కృతనిశ్చయంతో ఉంది.

  • Loading...

More Telugu News