: రైతు వెతలపై మురళీమోహన్ ఆవేదన
నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ లోక్ సభలో నేడు రైతుల వెతలపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలపై సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇకనైనా స్వామినాథన్ కమిటీ సూచనలను అమలు చేయాలని కోరారు. దేశానికి రైతు వెన్నెముక అని చెబుతున్నామని, అలాంటి రైతుల వెతల గురించి ఏ మేరకు పట్టించుకుంటున్నామన్న విషయాన్ని ఓసారి ఆలోచించుకోవాలని అన్ని పార్టీలకు సూచించారు. బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు టీడీపీ తరపున, అందరి తరపున నివాళులర్పిస్తున్నామని పేర్కొన్నారు.