: ప్రస్తుతం భారత్ మాకు అతిపెద్ద మార్కెట్: వైబర్


స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతుండడంతో భారత మార్కెట్ పై వివిధ యాప్స్ యజమానులు దృష్టిపెట్టారు. మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వైబర్ భారత్ లో విశేషమైన ఆదరణ పొందుతోందని ఆ సంస్థ వెల్లడించింది. వైబర్ రిజిస్టర్ వినియోగదారులు భారత్ లో 40 మిలియన్లు దాటారని, ప్రస్తుతం భారత్ తమకు అతిపెద్ద మార్కెట్ అని ఆ సంస్థ భారత దేశ హెడ్ అనుభవ్ నయ్యర్ తెలిపారు. వైబర్ కు పాప్యులారిటీ పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనమని అనుభవ్ చెప్పారు. గత ఏడాది కాలంగా వైబర్ స్థిరమైన అభివృద్ధి సాధిస్తోందని ఆయన వెల్లడించారు. కాగా, స్కైప్ కు ఎయిర్ టెల్ ధరలు నిర్ణయించడంతో వైబర్ ఆదరణ పెరగడం విశేషం.

  • Loading...

More Telugu News