: తెలంగాణలో సాగుతోంది దొరలపాలన: మోత్కుపల్లి
తెలంగాణ రాష్ట్రంలో సాగుతోంది దొరల పాలన అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలుర జూనియర్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదని అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు. కేవలం టీడీపీ ఆవిర్భావం తరువాతే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన పదవులు అనుభవిస్తోంది ఒకే కుటుంబమని ఆయన ఆరోపించారు. టీడీపీలో అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.