: కేవలం వంద నిమిషాలే బతికినా జన్మ చరితార్థం చేసుకున్నాడు!
పుట్టిన రోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి... అంటూ ఓ సినీ కవి జన్మ గొప్పదనాన్ని వర్ణించాడు. అయితే ఇవేవీ తెలియని ఓ పసికందు పుట్టిన తర్వాత కేవలం వంద నిమిషాలే బతికి జన్మ చరితార్థం చేసుకున్నాడని జస్ట్ గివింగ్ అనే సంస్థ తెలిపింది. బ్రిటన్ కు చెందిన జెన్ ఇవాన్స్, మైక్ హౌల్ స్టన్ దంపతులకు గతేడాది ఏప్రిల్ 22న కవలలు జన్మించారు. వారిలో ఒకరు ఆరోగ్యంగా ఉండగా, మరొకరు నయం చేయలేని వ్యాధితో జన్మించారు. కేవలం రెండు గంటలు మాత్రమే బతుకుతాడని వైద్యులు స్పష్టం చేయడంతో, వేగంగా తల్లిదండ్రులు ఆలోచించారు. స్వల్ప ఆయుష్షు మాత్రమే ఇచ్చిన దేవుణ్ణి నిష్టూరమాడకుండా, తమ ముద్దుల చిన్నారి జీవితం చరితార్థకం చేయాలని బాబు అవయవాలు దానం చేశారు. దీంతో చిన్నారి గుండె కవాటాలు, కిడ్నీలు వైద్యులు వేరు చేసి ఇంకో పిల్లాడికి అమర్చారు. దీంతో బ్రిటన్ లో అత్యంత చిన్న వయసులో అవయవదానం చేసిన చిన్నారిగా టెడ్డీ హౌల్ స్టన్ చరిత్రపుట (గిన్నిస్ రికార్డు)ల్లోకి ఎక్కాడు. టెడ్డీ హౌల్ స్టన్ అవయవదానం చేసి ఏడాది గడిచిన సందర్భంగా జస్ట్ గివింగ్ సంస్థ స్పూర్తిదాయక కధనాన్ని వెబ్ సైట్ లో ఉంచింది.