: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఆప్ ఆర్థిక సాయం


ఆత్మహత్య చేసుకున్న రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయంగా ఇవ్వనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. అతనిని రక్షించాలని తమ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారని, కానీ సాధ్యపడలేదని చెప్పారు. ఈ విషయంలో తమ పార్టీని ఢిల్లీ పోలీసులు నిందిస్తున్నారని, ఆ సమయంలో అక్కడి దృశ్యాలను చిత్రీకరించిన మీడియా కెమెరాలను ఒకసారి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ఇదిలాఉంటే, తన సోదరుడి మరణానికి కారణం ఆప్ నేతలేనని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గజేంద్రసింగ్ సోదరుడు ఆరోపించాడు. ర్యాలీలో పాల్గొనాలని తన సోదరుడిని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా పిలిచారన్నారు.

  • Loading...

More Telugu News