: సైనా, సింధు గెలిస్తే... కశ్యప్ ఓడిపోయాడు
బ్యాడ్మింటన్ ప్రపంచ నెంబర్ వన్ సైనా నెహ్వాల్ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. యువ కెరటం పీవీ సింధు కూడా చెలరేగుతోంది. కానీ పురుషుల టాప్ షట్లర్ పారుపల్లి కశ్యప్ మాత్రం మరింత వెనక్కెళుతున్నాడు. తాజాగా బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్ లో జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహారాపై 21-14, 10-21, 21-10 తేడాతో సైనా విజయం సాధించింది. దాంతో క్వార్టర్స్ లో సైనా చైనీస్ తైపీ ఐదవ సీడెడ్ క్రీడాకారిణి జు యింగ్ తైతో తలపడనుంది. ప్రపంచ చాంపియన్ షిప్ లో రెండుసార్లు కాంస్య విజేత అయిన పీీవీ సింధు కూడా మూడవ రౌండులో మకావుకు చెందిన క్రీడాకారిణిని 21-8, 21-9 తేడాతో ఓడించి క్వార్టర్స్ కు చేరుకుంది. కానీ, కామన్ వెల్త్ గేమ్స్ విజేత పారుపల్లి కశ్యప్ మాత్రం బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్ లో తన పోరాటాన్ని ముగించి ఇంటిదారి పట్టాడు.