: ఈ ఏడాదికి కేసీఆర్ సాధించిన ఘనత ఇదే!: పొన్నం సెటైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ కు నైతిక విలువల్లేవన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే ఈ ఏడాదికి ఆయన సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. రాజధాని హైదరాబాదులో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఆ కార్యక్రమ నిర్వహణకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో వెల్లడించాలని అన్నారు.