: ధనికులను ఇంటికి ఆహ్వానించి, మత్తుమందు ఇచ్చి వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న కి'లేడీ' అరెస్ట్


ఆమె పేరు రుబినా ఖాన్. వయసు 28. అందంగా ఉంటుంది. ఒక ఆటోమొబైల్ సంస్థలో పనిచేస్తోంది. అధిక డబ్బు కోసం అడ్డదారులు తొక్కి అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కిస్తోంది. రాజస్థాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ యువతి వాహనాలను కొనుగోలు చేసేందుకు వచ్చే వారిలో ధనికులను ఎంచుకుంటుంది. వారిని తన ఇంటికి ఆహ్వానించి డ్రగ్స్ ఇస్తుంది. వారితో గడిపి అశ్లీల సీడీలు తయారు చేస్తుంది. వాటిని చూపిస్తూ, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతుంది. ఉదయ్ పూర్ పరిసర ప్రాంతాలకు చెందిన ఎందరితోనో సన్నిహితంగా మెలుగుతూ, బెదిరింపులకు పాల్పడింది. ఆమె ఒక 'స్నేహితుడు' రఫీక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక రోజు తాను రుబినా ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లానని, మత్తుమందులు కలిపిన బీర్ ఆఫర్ చేస్తే దాన్ని తెలియకుండా తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని, తిరిగి లేచి చూస్తే, తన ఇంట్లోనే ఉన్నానని, 'రాత్రి మిమ్మల్ని కారు డ్రైవర్ తీసుకువచ్చాడు' అని తన భార్య తెలిపిందని రఫీక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొద్ది రోజుల తరువాత 'నన్ను లైంగికంగా వేధించావు. రూ. 30 లక్షలు ఇవ్వకుంటే, పోలీసు కేసు పెడతా' అని రుబినా నుంచి ఫోన్ వచ్చినట్టు తెలిపాడు. పరువు పోకూడదన్న ఉద్దేశంతో, ఆమెతో బేరం కుదుర్చుకుని రూ. 2.5 లక్షలు చెల్లించానని, అయినా, సీడీలు ఇవ్వకుండా మళ్లీ బెదిరింపులు మొదలు పెట్టిందని చెప్పాడు. దీంతో రుబినాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె దగ్గర పదుల సంఖ్యలో సీడీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండుకు తరలించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News