: ఎర్రబెల్లివి బ్లాక్ మెయిల్ రాజకీయాలు... ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: తలసాని


తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎర్రబెల్లి దయాకరరావు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసమే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని తలసాని చెప్పారు. పార్టీ ఖాళీ అవుతుందన్న అక్కసుతోనే టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. మిగతా టీడీపీ నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను సనత్ నగర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఈ సందర్భంగా సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News