: రాహుల్ ప్రసంగం అద్భుతం... అధిష్ఠానానికి టీ కాంగ్ నేతల కితాబు


రెండు నెలల సుదీర్ఘ సెలవు తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దూసుకుపోతున్నారట. మోదీ సర్కారుపై ఆయన ప్రారంభించిన ప్రత్యక్ష పోరు అద్భుతంగా ఉందంటూ సొంత పార్టీ నేతల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, రాహుల్ వ్యాఖ్యల్లో పదును పెరిగిందని చెప్పారట. కిసాన్ ర్యాలీలో రాహుల్ ప్రసంగం మెరుగ్గా ఉందంటూ ఆయన మెచ్చుకున్నారు. ఇక టీ కాంగ్ ఎంపీ నంది ఎల్లయ్య మరో అడుగు ముందుకేసి ఏకంగా రాహుల్ నే కలిశారు. కిసాన్ ర్యాలీలో మీ ప్రసంగం అద్భుతంగా ఉందని ఆయన రాహుల్ గాంధీకి కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News