: మోదీపై ఒబామా ఆర్టికల్ పట్ల రాహుల్ స్పందన


భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై టైమ్స్ మ్యాగజైన్ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన పరిచయ వ్యాసంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు లోక్ సభలో మాట్లాడారు. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు ప్రశంసించడం ఇదే తొలిసారని అన్నారు. ఈ మేరకు జీరో అవర్ లో మాట్లాడిన రాహుల్, "నేను కాంగ్రెస్ అధినేత్రి (సోనియా గాంధీ) నివాసంలో ఉన్నప్పుడు ఇటీవలి టైమ్ పత్రిక చూశాను. మోదీనీ ప్రశంసిస్తూ ఒబామాజీ సుదీర్ఘ వ్యాసం రాశారు. బహుశా 60 ఏళ్లలో అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా ఒకరిని కీర్తించడం ఇదే మొదటిసారి" అని రాహుల్ పేర్కొన్నారు. గతంలో యూఎస్ అధ్యక్షుడు ఇలాగే గోర్బచేవ్ (మాజీ యూఎస్ఎస్ఆర్ నేత మిఖాయిల్)ను ప్రశంసించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News