: మే 5 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు కదలవ్... యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు విఫలం
ఫిట్ మెంట్ విషయంలో ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలన్న అంశంపై యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో కార్మికులు అసంతృప్తికి గురయ్యారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చెబుతామని ఆర్టీసీ యాజమాన్యం చెప్పడంతో వారు సమ్మెకే మొగ్గు చూపారు. ఇక, యాజమాన్యానికి గడువిచ్చేది లేదని, మే 5 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని యూనియన్లు తెలిపాయి. ఇరు రాష్ట్రాల్లో సమ్మె చేపడుతున్నట్టు ఈయూ, టీఎంయూ నేతలు తెలిపారు.