: సుప్రీంలో ఏపీ ప్రైవేట్ ట్రావెల్స్ కు నిరాశ... పిటిషన్ కొట్టివేసిన కోర్టు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన రవాణా పన్నుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలకు నిరాశ ఎదురైంది. తెలంగాణలో పన్ను చెల్లించాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ట్రావెల్స్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది. త్వరలో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఏపీ ట్రావెల్స్ తెలంగాణలో పన్ను చెల్లించక తప్పడంలేదు.