: బీహార్ జిల్లాల్లో తుపాను బీభత్సం ...32 మంది మృతి


బీహార్ లో తుపాను బీభత్సం సృష్టించింది. పుర్ణియా, భగల్ పూర్, మదేపురా జిల్లాల్లో 32 మంది పౌరులు మరణించగా, దాదాపు 80 మంది వరకు గాయాలపాలయ్యారని విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి తెలిపారు. అకాల వర్షాలతో రైతులు భారీగా నష్టపోయారన్నారు. మరోవైపు రెండు జిల్లాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. అంతేగాక చనిపోయినవారి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దెబ్బతిన్న రెండు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను బీభత్సం గతరాత్రి చోటు చేసుకుందని, తాను స్వయంగా రెండు జిల్లాల్లోని పరిస్థితిని సమీక్షిస్తానని నితీష్ చెప్పారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News