: ఐఏఎస్ లు సహ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు: గవర్నర్ కు సమాచార కమిషనర్ల ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ లో సమాచార కమిషనర్లు, ఐఏఎస్ అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సమాచార హక్కు చట్టం కింద విధిగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ఇచ్చేందుకు పలువురు ఐఏఎస్ అధికారులు నిరాకరిస్తున్నారట. ఈ విషయంలో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులంతా మూకుమ్మడిగా మాట్లాడుకుని సహ చట్టానికి తూట్లు పొడుస్తున్నారట. ఈ మేరకు ఏపీ ప్రధాన సమాచార కమిషనర్, నలుగురు కమిషనర్లు కొద్దిసేపటి క్రితం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఐఏఎస్ అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారని ఈ సందర్భంగా వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.