: సల్మాన్ ఖాన్ కు అస్వస్థత... కొత్త చిత్రం షూటింగ్ వాయిదా


నటుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'భజరంగి భాయ్ జాన్' చిత్రం షూటింగ్ కోసం కాశ్మీర్ లో ఉన్నాడు. అయితే రెండు రోజుల నుంచి చెవిలో ఇన్ ఫెక్షన్, సైనసైటిస్ కారణంగా సల్మాన్ ఇబ్బంది పడుతుండటంతో షూటింగ్ వాయిదా పడింది. "ఇది నిజం. సల్మాన్ ఖాన్ చాలా నొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ పెయిన్ కిల్లర్స్ తీసుకుని సల్మాన్ షూటింగ్ ప్రారంభించమని వెంటనే చెప్పారు" అని ఆ సినిమాకు సంబంధించిన అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. దాదాపు 40 రోజుల షెడ్యూల్ కాశ్మీర్ లో కొనసాగనుంది.

  • Loading...

More Telugu News