: సీఎం కేసీఆర్ ను కలసిన టీ.టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీ.టీడీపీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సీఎం అధికారిక నివాసంలో కలిశారు. మంచిరెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు కేసీఆర్ ను కలవడంతో గులాబీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ లో చేరే విషయంపై ముందుగానే తన అనుచరులు, ఇతరులతో నిన్న (మంగళవారం) ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి చర్చించారు. అంతేగాక తమ ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్న తమకు అంగీకారమేనని మంచిరెడ్డి అనుచరులు కటౌట్లు కూడా పెట్టడం విశేషం.

  • Loading...

More Telugu News