: ఇకపై ఏపీ కేబినెట్ సమావేశాలు బెజవాడలోనే... సిద్ధమవుతున్న హరిత బెర్మ్ పార్క్!
ఇక మీదట ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశాలు విజయవాడలోనే జరగనున్నాయి. ఇందుకోసం సరైన వేదికను ఏర్పాటు చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో అధికారులు విజయవాడలోని భవానీ ద్వీపం ముఖ ద్వారాన్ని ఎంపిక చేశారట. ఇదివరకే ఈ స్థలంలో హరిత బెర్మ్ పార్క్ ను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. దీనిని ఏపీ కేబినెట్ సమావేశాల కోసం తీర్చిదిద్దే దిశగా చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని అంతర్జాతీయ స్థాయి సంస్థను కోరనున్నారు. ఈ మేరకు శరవేగంగా చర్యలు చేపడుతున్న అధికారులు వారంలోగా టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాక భవానీ ద్వీపాన్ని సింగపూర్ లోని సెంతోషా దీవి తరహాలో అభివృద్ధి చేసేందుకూ సిద్ధమవుతున్నారని సమాచారం.