: బావిలో సుమో... బయటికి తీసి ఆశ్చర్యపోయిన పోలీసులు
చిత్తూరు జిల్లాలో మరోమారు ఎర్రచందనం స్మగ్లింగ్ కలకలం రేగింది. యేర్పేడు మండలం సీతారాంపేట వద్ద ఓ బావిలో సుమో వాహనం కనిపించింది. పోలీసులు, స్థానికులు తొలుత దాన్నో ప్రమాదంగా భావించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పోలీసులు ఆ సుమో వాహనాన్ని వెలికితీయగా, అందులో ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. పోలీసుల కళ్లుగప్పేందుకు స్మగ్లర్లే సుమోను బావిలో తోసేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.