: ఐఎస్ అధినేత అల్ బాగ్దాదీకి తీవ్ర గాయాలు?
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడని గార్డియన్ పత్రిక ఓ కథనం వెలువరించింది. మార్చిలో సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో అల్ బాగ్దాదీకి బలమైన దెబ్బలే తగిలాయని గార్డియన్ పేర్కొంది. బాగ్దాదీ ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో ఉన్నాడన్న సమాచారం మేరకు విమాన దాడులు నిర్వహించారని తెలిపింది. అప్పటి నుంచి అల్ బాగ్దాదీ ఐఎస్ రోజువారీ కార్యకలాపాలు పర్యవేక్షించలేకపోతున్నాడని వెల్లడించింది. అతడికైన గాయాలు తీవ్రమైనవని, అయితే, నిదానంగా కోలుకుంటున్నాడని పేర్కొంది. కాగా, బాగ్దాదీ బతికే అవకాశాల్లేవని ఐఎస్ అగ్రనేతలు 'కొత్త నేత' అంశంపై కసరత్తు చేశారని కూడా గార్డియన్ తెలిపింది.