: ఈ ఏడాది 164 కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలు: కేంద్రం
జమ్ము కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ సంవత్సరం 164 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనల సమయంలో ఇద్దరు పౌరులు, భద్రతా సిబ్బంది ఒకరు చనిపోయారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజ్జు లోక్ సభకు లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. అదే సమయంలో జమ్ము కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో 16 మంది చొరబాటుదారులను బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయని సభకు తెలిపారు.