: ఈజిప్ట్ మాజీ దేశాధ్యక్షుడికి 20 ఏళ్ల జైలుశిక్ష


ఈజిప్ట్ మాజీ దేశాధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి 20 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ, ఆ దేశ న్యాయస్థానం తీర్పిచ్చింది. 2012లో జరిగిన నిరసనకారుల హత్య కేసులో ఆయన్ను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ శిక్షను విధించింది. ఆయనపై పలు కేసులు విచారణలో ఉండగా, శిక్షపడ్డ మొదటి కేసు ఇది. డిసెంబర్ 2012లో అధ్యక్ష భవనం ముందు నిరసన తెలుపుతున్న ప్రజలపై ఆయన ప్రోద్బలంతో కాల్పులు జరిపారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై హత్యారోపణలను తోసిపుచ్చిన కోర్టు 'బలాన్ని ఉపయోగించారు' అని పేర్కొంటూ, ఈ శిక్షను విధించింది. ఆయనతో పాటు మరో 12 మంది బ్రదర్ హుడ్ పార్టీ నేతలకూ ఇదే శిక్ష విధిస్తున్నట్టు జడ్జి తీర్పిచ్చారు.

  • Loading...

More Telugu News