: తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్ లో తమిళ సినీ ప్రముఖుడు
తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో సదరు వ్యక్తికి సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. శేషాచలం ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లు, వారితో సంబంధం ఉన్నవారిని పట్టుకునే విషయంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గడంలేదు. ఈ క్రమంలో ఏపీ, తమిళనాడుకు చెందిన కొందరు నేతలు, మాజీ మంత్రులకు కూడా స్మగ్లింగ్ విషయంలో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు. ఆధారాలు దొరికాక పలువురు ముఖ్య ప్రజాప్రతినిధులను కూడా అరెస్టు చేస్తారని తెలుస్తోంది.