: అజ్మీర్ షరీఫ్ కు చాదర్ పంపిన ప్రధాని మోదీ
అజ్మీర్ లోని ప్రముఖ హజ్రత్ ఖ్వాజా మోయినుద్దీన్ చీస్తీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాదర్ పంపారు. ఆదివారం నుంచి 803వ ఉర్సు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా భక్తితో దాన్ని పంపారు. మోదీ తరపున కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చాదర్ ను దర్గా అధిపతులకు అందజేశారు. యాదృచ్ఛికంగా ఈ ఏడాది అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా ఎరుపు రంగు చాదర్ ను దర్గాకు కానుకగా పంపిన సంగతి తెలిసిందే. గత శనివారం దాన్ని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అందజేశారు.