: అవనిగడ్డలో కూలిన ఆలయం... కాలువలో పడ్డ ఆంజనేయస్వామి విగ్రహం


కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రధాన సెంటర్లో ఉన్న ఆంజనేయస్వామి వారి ఆలయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మూలవిరాట్టు సహా ఆలయం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రాంతంలో గత 20 రోజులుగా కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా, కేఈబీ కెనాల్లో ప్రొక్లెయినర్ల సహాయంతో పనులు జరుగుతున్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు కాలువ కట్ట పనులను అసంపూర్తిగా వదిలేశాడు. పనులు పూర్తి కాకుండానే గత రాత్రి ఒక్కసారిగా నీరు వదలడంతో, కాలువ పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం కుప్పకూలింది. ఆలయం ధ్వంసం కావడంపై భక్తులు తీవ్ర ఆందోళనకు, ఆగ్రహానికీ గురయ్యారు. కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, దీనికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గుడి పునర్నిర్మాణం వెంటనే చేపట్టకపోతే ఊరికి కీడు కలుగుతుందని అన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో గుడి మూసివుండడంతో ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదు.

  • Loading...

More Telugu News